Khaleja : మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన నటించిన ఖలేజా మూవీ మే 30న రీ రిఈజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్లు సాధించింది. రీ రిలీజ్ లో రూ.5 కోట్లకు మించి వసూళ్లు చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ సినిమాలు ఇప్పటికే ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఖలేజా సినిమా కూడా చేరిపోయింది.
Read Also : Surveen Chawla : ఆ డైరెక్టర్ లాగి ముద్దు పెట్టబోయాడు.. ‘రానా నాయుడు’ నటి ఆరోపణలు..
అయితే గబ్బర్ సింగ్ సినిమానే డే1 కలెక్షన్లలో టాప్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత మూడు సినిమాలు మహేశ్ వే కావడం విశేషం. ఖలేజా సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చింది. ఓ ఊరి సమస్యను తీర్చేంందుకు మహేశ్ ఎలా వెళ్లాడు.. ఏం చేశాడు అనేది నమ్మకాలకు లింక్ పెడుతూ త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో కలెక్షన్ల పరంగా అనుకున్నంత సాధించలేకపోయినా.. ఇప్పుడు మాత్రం మంచి కలెక్షన్లు వసూలు చేసింది.
Read Also : Sree Leela : శ్రీలీల ఎంగేజ్ మెంట్..? ఫొటోలు వైరల్..!