టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడుస్తోంది. కథను ఒక భాగంలో పూర్తి చేయలేకపోవడంతో, రెండు.. ఒక్కోసారి మూడు భాగాలకు కూడా వెళ్లిపోతున్నారు దర్శక-నిర్మాతలు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరూ సీక్వెల్స్ బాట పట్టారు. అయితే, వీరందరి కంటే సీక్వెల్స్ విషయంలో ముందున్న హీరో డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఏ సినిమాను ఓకే చేసినా, దానికి సీక్వెల్ ఉంటుందా అనే చర్చ మొదలవుతోంది. ప్రభాస్ వరుసగా సీక్వెల్స్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నారా? లేదంటే దర్శకులే పెద్ద కథలను ఆయన కోసం సిద్ధం చేస్తున్నారా? అనే సందేహం అభిమానులలో ఉంది.
Also Read:Naveen Chandra: ఫ్యాన్’గా వచ్చాడు..సినిమాలో విలనయ్యాడు!
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, ఏకంగా ఫ్రాంచైజీగా తీస్తామని నిర్మాత విశ్వ ప్రసాద్ ప్రకటించారు. మొదటి భాగం పూర్తి కావడానికే మూడేళ్లు పట్టవచ్చని అంచనా. అయితే, మొదటి భాగం ఫలితం ఆధారంగానే సీక్వెల్ ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ‘ఫౌజీ’ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని దర్శకుడు స్వయంగా చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 సమ్మర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న ‘స్పిరిట్’ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా, ఈ చిత్రం కూడా భారీ స్థాయిలో ఉంటుందని అంచనా.
Also Read:Malavika Mohanan: ఆయనతో నటించాలని ఉన్నా..ఆ సినిమా నేను చేయట్లేదు !
ఆసక్తికరంగా, ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ తర్వాత వచ్చిన భారీ చిత్రాలు, హిట్టయినా సీక్వెల్స్‌కు మాత్రం ప్రభాస్ వెంటనే డేట్స్ ఇవ్వడం లేదు. ‘సలార్’ మొదటి భాగం పెద్ద హిట్ అయినప్పటికీ, ‘సలార్ 2′ (శౌర్యాంగ పర్వం) కోసం డార్లింగ్ ఇంకా డేట్స్ కేటాయించలేదు. అలాగే, కల్కి’ సీక్వెల్ తప్పక ఉంటుంది. కానీ, ఈ సీక్వెల్స్‌కు ప్రభాస్ ఇంకా డేట్స్ ఇవ్వకుండానే కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. గతంలో తెలుగులో సీక్వెల్ తీస్తే ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉండేది. కానీ, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ఈ సెంటిమెంట్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సృష్టించిన ప్రభంజనం తర్వాత తెలుగులో వరుసగా సీక్వెల్స్ ట్రెండ్ మొదలైంది. ప్రభాస్ ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం చూస్తే… ‘ఫౌజీ’ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘స్పిరిట్’ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. అంటే, దాదాపు రెండేళ్ల వరకు ప్రభాస్ పూర్తిగా బిజీగా ఉండనున్నారు. మొత్తంగా, ప్రభాస్ చేస్తున్న ‘రాజా సాబ్’ మరియు రాబోయే ‘ఫౌజీ’ చిత్రాలు కూడా సీక్వెల్స్ అయ్యే పనేనా అనే చర్చ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘బాహుబలి’తో మొదలైన ఈ సీక్వెల్ ప్రయాణం… డార్లింగ్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన అంశంగా మారిందనడంలో సందేహం లేదు.