Ponguleti Srinivas Reddy: తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ.. కాంగ్రెస్ ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy: తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, కాంగ్రెస్‌ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీలో భట్టి విక్రమర్క అక్రమాల వివరాలు చెబుతుంటే అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఐదు పోగులు వేస్తే పాతవారు మూడు పోగులు తీసుకోండి.. నాకు.. నన్ను నమ్ముకున్న వారికి రెండు పోగులు చాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తల సమిష్టి బలంతో పార్టీని ముందుకు తీసుకెళ్దామన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కాంగ్రెస్ నీ గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపు నిచ్చారు. సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసం సమయం వచ్చిందని, అందుకు రాబోయే మూడునెలలే ఉన్నాయని పొంగులేటి అన్నారు. గ్రూపులు లేకుండా సమిష్టి కృషితో భట్టి,రేణుక, సంబాని,నేను కలిసి అందరి ఆలోచన ప్రకారం ముందుకు వెళ్దామన్నారు. తెలంగాణ వచ్చి తొమ్మిదిన్నర ఏళ్లైంది… మయాల పఖిర్ వేషాలు,మాటలు ఇక నమ్మొద్దని తెలిపారు. తెలంగాణ మేమే తెచ్చామనిని కల్వకుంట్ల చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Jagtial: కోరుట్ల కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..! ఆ నాగరాజు ఎవరు?
Also Read
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
కల్వకుంట్ల అసలు రూపం, దొంగ దీక్ష అన్నారు. 2014 ముందు మీ ఆస్తి, తర్వాత ఆస్తులు నికు తెలుసు,తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తుపాకీ పట్టుకొని ఎన్ని మోసాలు, దందాలు, భూములు కొల్లగొట్టవో ప్రజలకు తెలుసన్నారు. ఎన్ని వ్యాపారాలు చేసి ఇంత డబ్బు సంపాదించారో తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ మీ ఆస్తులు అక్రమాలు కుప్పలుగా దండు కున్నరని, దీన్ని ప్రజలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. రైతులపై ముసలి కన్నీరు కారుస్తూ రుణమాఫి అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సిబ్బందిపై మీరు ఎంతో అరాచకాలు ఇబ్బందులకు గురి చేసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అంటున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పుపై వెన్నులో వణుకు పుట్టుకుందని కీలక వ్యాఖ్యాలు చేశారు. ఇక మీరు ఫ్లాం హౌసేకి పరిమితం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసలు వడ్డీ కక్కిస్తామన్నారు. కాంగ్రెస్ అంటే సముద్రం .. ఇందులో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకు రావడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
IIT Student: ప్లీజ్ నా డెడ్ బాడీని ఎవరికీ చూపించకండి.. ఐఐటీ విద్యార్థిని సూసైడ్ నోట్..
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?