ఒత్తైన, అందమైన హెయిర్ తమ సొంతమవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశశైలీ, కాలుష్యం ఇలా అనేక రకాల కారణాల వల్ల విపరీతంగా జుట్టు రాలిపోతుంది. దీంతో ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకున్నా.. బెస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడలేరు.. అలాంటి వారు పలు జాగ్రత్తలు తీసుకుంటే.. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
Read Also: Joe Biden: గాజాలో ఆస్పత్రిపై దాడి ‘‘మీ పని కాదు’’.. ఇజ్రాయిల్‌కి జో బైడెన్ మద్దతు..
అయితే, చాలా మంది జుట్టుకి ఈ మధ్యకాలంలో కెరాటిన్ చికిత్స తీసుకుంటున్నారు. అయినా, ఈ సమస్య తగ్గడం లేదు.. మీరు మీ జుట్టుకు ఎంత ఎక్కువ చికిత్స చేస్తే, అది అంత రాలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కెరాటిన్ ట్రీట్ మెంట్ వల్ల వెంట్రుకలు స్మూత్ గా కనబడతాయి.. కానీ సరిగ్గా చేయకపోతే జుట్టు మూలాలు చాలా వీక్ గా మారతాయి. ఇది శాశ్వతంగా జుట్టు రాలడానికి కారణమౌతుంది. కెరాటిన్ ట్రిట్మెంట్ లో వేడి, రసాయనాలు ఉంటాయి.. ఈ చికిత్స టైంలో జుట్టు కూడా చాలా పెరుగుతుంది.. దీని కారణంగా, జుట్టు సహజ బలం కూడా తగ్గిపోతుంది.
Read Also: Gautam Gambhir: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక, మరో కారణం ఎంటంటే.. మీ జుట్టుకు ఎక్కువ నూనె రాయడం వల్ల కూడా జుట్టు వీక్ గా అవుతుంది. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు దృఢంగా మారుతుందనేది అందరు నమ్ముతారు. అయితే కొన్ని సందర్భాల్లో జుట్టు రాలడం కూడా స్టార్ట్ అవుతుంది. జుట్టుకు ఎక్కువ నూనె రాయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ అనేటివి బ్లాక్ అవుతాయి. మీకు ఇప్పటికే హెయిర్ ఫాల్ సమస్య ఉంటే.. ఎక్కువ నూనె జుట్టుకు రాయొద్దు. అంతే కాదు, రాత్రిపూట నూనె రాసుకుని నిద్రపోవడం వల్ల జుట్టు టెలోజెన్ దశకు చేరి చాలా నష్టం కలిగిస్తుంది. ఇది వెంట్రుకల ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసి జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
Read Also: Marriage Age of Girls: ఆడపిల్లల వివాహ వయస్సు పెంచుతారా?
మన జుట్టు ఎప్పుడూ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.. అలాంటి పరిస్థితిలో, మూలాలు కూడా బలహీనంగా మారుతాయి. జుట్టు రాలడం కూడా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య పెరిగితే.. జుట్టును కొద్దిగా తెరిచి ఉంచి ఒత్తిడిని తగ్గించుకోవాలి.. ఇక, సరైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒత్తిడి , ఆహారం కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తాయి.. కాబట్టి మీరు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సెలూన్ ట్రీట్‌మెంట్‌లను తగ్గించుకోవడంతో పాటు.. ఒత్తిడిని తగ్గించుకోని.. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని నిపుణులు అంటున్నారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..