Vladimir Putin: ఉక్రెయిన్ పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు శుక్రవారం ప్రకటించింది. ఇదే ఆరోపణలపై రష్యా బాలల హక్కుల ప్రెసిడెంట్ కమిషనర్, ల్వోవా-బెలోవాపై కూడా వారెంట్ జారీ చేసినట్లు హేగ్ ఆధారిత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తెలిపింది. ఐసీసీలో రష్యాకు సభ్యత్వం లేదు. ఐసీసీ వారెంట్‌ను ఎలా అమలు చేయాలని యోచిస్తోందనేది అస్పష్టంగా ఉంది.
వ్లాదిమిర్ పుతిన్ “జనాభాను (పిల్లలను) చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల నుండి రష్యన్ ఫెడరేషన్‌కు జనాభా (పిల్లలు) చట్టవిరుద్ధంగా బదిలీ చేయడం వంటి యుద్ధ నేరానికి బాధ్యత వహిస్తాడు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన ఫిబ్రవరి 24, 2022 నాటి నుంచి నేరాలు జరిగినట్లు ఐసీసీ తెలిపింది. ఈ నేరాలకు పుతిన్్ వ్యక్తిగత నేర బాధ్యత వహిస్తాడని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని పేర్కొంది. బాధితులు, సాక్షులను రక్షించేందుకు అరెస్ట్ వారెంట్లను గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొంది.
Read Also: Groom Sings Song: వేదికపై పాట పాడాడు.. పెళ్లి పెటాకులైంది
ఐసీసీ అనేది దేశాల యుద్ధనేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలను విచారిస్తుంది. రష్యా దాడి చేసిన కొద్ది రోజులకే ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ దర్యాప్తు ప్రారంభించారు.ఈ నెల ప్రారంభంలో ఉక్రెయిన్ పర్యటన తర్వాత కరీం ఖాన్ మాట్లాడుతూ, పిల్లల అపహరణల గురించి ” తమ కార్యాలయం ప్రాధాన్యతగా దర్యాప్తు చేస్తోందని అన్నారు. రష్యా తన సైనికుల యుద్ధ నేరాల ఆరోపణలను ఖండించింది.