Groom Sings Song: వేదికపై పాట పాడాడు.. పెళ్లి పెటాకులైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Bride Calls Off Wedding After Groom Sings SRK Baadshah Song: ‘నేను పెళ్లికొడుకుని కదా, ఏం చేసినా చెల్లుతుంది’ అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. మరీ ముఖ్యంగా.. ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తే, అందుకు పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇదిగో, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తాజా ఉదంతమే! ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. పెళ్లికొడుకు ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు స్టేజ్ మీద ఒక పాట పాడాడు. తానేదో రియల్ లైఫ్ అర్జున్ రెడ్డిలాగా యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ రెచ్చిపోయాడు. దీంతో.. ఖంగుతిన్న వధువు, పెళ్లిని రద్దు చేసుకుంది. ఇలాంటివాడిని చచ్చినా చేసుకోనంటూ, ఆ మండపం నుంచి వెళ్లిపోయింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Anupama Parameswaran: నల్ల కలువ విరబూసినట్లుందే
Also Read
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లాలో ఒక అమ్మాయికి ఒక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి వేడుకను వధువు తరఫు వారు ఘనంగా నిర్వహించారు. అబ్బాయి తరఫు వాళ్లు మండపానికి చేరుకోవడం, పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అక్కడంతా సవ్యంగా సాగుతోంది. పెళ్లి ఘడియలు రానే వచ్చేసరికి.. వేదిక మీదకు వధువుని తీసుకొచ్చారు. అప్పుడే అసలు కథ మొదలైంది. పూలదండలు మార్చుకోవడానికి ముందు.. పెళ్లికొడుకు సడెన్‌గా షారుఖ్ ఖాన్ నటించిన ‘బాద్‌షా’ సినిమాలోని ఓ పాట పాడటం మొదలుపెట్టడం. ‘ఆషిక్ హు మై, కాతిల్ భీ హు, సబ్‌కే దిలో మే, షామిల్ భీ హు’ అనే పాటను యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ పాడాడు. దీంతో.. వేదికపై ఉన్న వధువు షాక్‌కు గురైంది. ‘‘ఇప్పటివరకు బాగానే ఉన్నాడు.. ఇంతలో ఇతనికి ఏమైంది?’’ అంటూ ఆశ్చర్యానికి గురవుతూ చూసింది.
Viswak Sen: నా మాస్ అమ్మ మొగుడు.. ఎన్టీఆర్.. అసలు సినిమా ముందుంది
ఒకవేళ అతడు రొమాంటిక్‌గా ఆ పాట పాడి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవేమో కానీ, అందుకు భిన్నంగా అతడు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. దాంతో కోపాద్రిక్తురాలైన వధువు, వెంటనే పెళ్లి రద్దు చేసింది. పెళ్లికొడుకు ఏదైనా విషయంలో కోపంగా ఉన్నాడేమోనని పెళ్లికూతురు తరఫు వారు మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే.. ఆ అన్నగారు మాత్రం వినే స్థితిలో లేరు. చివరికి పోలీసులు రంగంలోకి దిగినా.. అతడిలో మాత్రం మార్పు రాలేదు. ఆ దెబ్బకు.. అతడు ‘మానసిక రోగి’ అనుకొని, పెళ్లి కూతురు తరఫు వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!