Russia President: రష్యా అధ్యక్షుడు పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలు, బాలీవుడ్‌పై ప్రసంశల వర్షం గుప్పించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పుకొచ్చారు.
సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ప్రయోగించడానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ తో కొనసాగుతున్న వార్ అణుయుద్ధాలకు దారి తీస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు ఆన్సర్ ఇచ్చారు.
రష్యా ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు. దేశం యొక్క జాతి మనుగడ కోసం రష్యన్ కుటుంబాలు కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాలన్నారు.
క్రెమ్లిన్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా అధినేతతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపించారు.
భారత్‌లో జీ20 సమ్మిట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు తెలిసింది. న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు.
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు.
కొన్ని ఘటనల నేపథ్యంలో దేశాల అధ్యక్షులు తమ విదేశాల పర్యటనలను రద్దు చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్‌లతో క్రెమ్లిన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిందని రష్యా అధికారులు బుధవారం ఆరోపించారు
ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ యత్నించిందని రష్యా నేడు ఆరోపించింది. ఆరోపించిన దాడికి ఉపయోగించిన రెండు డ్రోన్‌లను కూల్చివేసినట్లు పేర్కొంది.