గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్‌లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్‌లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు.
ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు.
CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లలో రహస్యంగా కెమెరాలు అమర్చి, వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై హాస్టల్ వంట సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థినులు…
విశాఖ సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది... పైన ఓయో రూమ్స్ కింద నర్సింగ్ హాస్టల్ పెట్టి భద్రత గాలికొదిలేసారు హాస్టల్ యాజమాన్యం.. అర్దరాత్రి బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి గోడ దూకి బయటకి వెళ్లేందుకు ప్రయత్నించింది విద్యార్థిని..