Singer Kalpana: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన సింగర్ కల్పన.. వారిపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదన సింగర్ కల్పన కలిసింది. తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నానంటూ.. కొన్ని యూట్యూబ్ ఛానల్‌లు తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కల్పన డిమాండ్ చేసింది. కాగా… అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన కోలుకున్న విషయం తెలిసిందే. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ నిన్న ఓ వీడియో విడుదల చేసింది. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు తెలిపింది.
READ MORE: Ranya Rao: సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం..
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
‘‘మీడియాలో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను నా భర్త, కుమార్తె సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 సంవత్సరాల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నా. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసుల, పోలీసుల సహాయం వల్ల నేను మీ ముందు ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మిమ్మల్ని అలరిస్తాను. ఆయన సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ వీడియో విడుదల చేసింది.
READ MORE: Karnataka: బెంగళూర్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన.. హక్కుల కోసం పోరాటం..
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..