MP News:మధ్యప్రదేశ రాజధాని భోపాల్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటన వైరల్‌గా మారింది. జిల్లా కోర్టు వద్ద ఈ దాడి జరగడం గమనార్హం. హిందూ మతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకునేందుకు వచ్చిన సమయంలో హిందూ గ్రూపు ఈ దాడికి పాల్పడింది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు అతడిని కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Jeet Adani: గుజరాతీ సంప్రదాయంలో.. నిరాడంబరంగా జీత్ అదానీ వివాహం..
బాధితుడు నర్సింగ్‌పూర్ నివాసి, పిపారియాకు చెందిన హిందూ మహిళను రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసకునేందుకు కోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. బాధిత వ్యక్తి, పెళ్లికి సంబంధించిన పత్రాలను నోటరీ చేయించడానికి, తన లాయర్‌ని కలవడానికి మహిళతో కలిసి జిల్లా కోర్టుకు వచ్చింది. దీనిపై మాట్లాడేందుకు ఇరువురు కుటుంబాలను పిలిచినట్లు ఎంపీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జై హింద్ శర్మ తెలిపారు.
ప్రస్తుతం వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, దాడిపై దర్యాప్తు జరుగుతోందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్షయ్ చౌదరి తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే, దీంట్లో ‘‘లవ్ జిహాద్’’ కుట్ర ఉన్నట్లు హిందూ గ్రూప్ ఆరోపించింది. మహిళను వలలో వేసుకుని తీసుకువచ్చాడని, న్యాయవాదుల నుంచి సమాచారం రావడంతో జోక్యం చేసుకున్నామని సంస్కృతి బచావో మంచ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ అన్నారు. ముస్లిం వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*ब्रेकिंग भोपाल*
*भोपाल जिला अदालत में जमकर हुआ हंगामा*
*मुस्लिम युवक की हिंदूवादी संगठन के कार्यकर्ताओं ने की पिटाई*
*हिंदूवादी संगठन ने युवक पर लगाए लव जिहाद के आरोप*
*लव जिहाद का आरोप लगाते हुए की जमकर पिटाई*
नरसिंहपुर से मुस्लिम युवक कोर्ट हिंदू लड़की को लेकर पहुंचा था। pic.twitter.com/39wGOamwQr
— tarun yadav / तरुण यादव (@CameramanTarun) February 7, 2025