ప్రస్తుతం టీమిండియా వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉంది. ఈ క్రమంలో జులై 12 నుంచి విండీస్ తో నెల రోజుల పాటు సిరీస్ లను భారత జట్టు ఆడనుంది. ఇందుకోసం భారత్ ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకుంది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది కూడా వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగనుంది. ఈ ఏడాది అక్టోబర్ తో పాటు 2024లో టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. అయితే.. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
Read Also: Turmeric: పసుపుతో అందం మీ సొంతం.. ఉపయోగిస్తే అన్నీ లాభాలా..!
ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ పై సందిగ్ధత నెలకొని ఉంది. ఓపెనింగ్ స్థానం కోసం యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ల రూపంలో రోహిత్ శర్మకు తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ ను కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా? అనే చర్చ క్రికెట్ అభిమానుల మధ్య జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మను వేధిస్తోన్న ప్రధాన సమస్య ఫిట్ నెస్.. అతను 36 ఏళ్లు ఉండటం పాటు ఇంతకు ముందులాగా మైదానంలో చురుకుగా కదలటం లేదు. ఫీల్డింగ్ లో బంతి వెనుక పరుగెత్తడంలో రోహిత్ శర్మ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో కూడా నానా అవస్థలు పడుతున్నాడు.
Read Also: Falaknuma Express Train: వారంలో ప్రమాదం అని హెచ్చరిక లేఖ.. అదే నిజమైందా?
అయితే.. మరో రెండు మూడేళ్ల పాటు భారత జట్టు తరఫున ఆడాలంటే మాత్రం రోహిత్ శర్మ తన ఫిట్ నెస్ ను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు నిలకడగా ఆడాల్సి ఉంది. అప్పుడే రోహిత్ శర్మ టీమిండియా కెరీర్ మరికొన్నేళ్ల పాటు సజావుగా సాగుతుంది. లేదంటే వన్డే ప్రపంచకప్ అనంతరం అతడిపై బీసీసీఐ వేటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.