Is there any conspirancy behind Falaknuma Express Train accident: ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఉదయం 11 గంటలకు బెంగాల్ నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లోని ఒక బోగీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇక ఈ క్రమంలో ఆ బోగీలో ఉన్న వారు గమనించి వెంటనే చైన్ లాగడంతో అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో బోగీలో ఉన్న ప్యాసింజర్లు ట్రైన్ లో నుంచి కిందకు దూకి ట్రైన్ నుంచి దూరంగా పారిపోయారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణికులను దించి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ముందే అప్రమత్తం అవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది అని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే మంటలను ఆర్పే సిబ్బంది వచ్చేలోపే మిగతా బోగీలకు కూడా క్రమంగా నిప్పు అంటుకోవడంతో ఆ ఏరియాలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి.
Bedurulanka 2012: ఆగస్టు 25న కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’
ఐదు బోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్న అధికారులు ఒక బోగి మాత్రం పాక్షికంగా కాలిపోయిందని తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో సరిగ్గా వారం క్రితం సికింద్రాబాద్ రైల్వే అధికారులకు వచ్చిన బెదిరింపు లేఖ గురించి చర్చ జరుగుతోంది. వచ్చే వారం హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ‘బాలాసోర్ తరహా రైలు ప్రమాదం’ జరుగుతుంది అని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు జూన్ 30న ఒక లేఖ వచ్చింది. బాలాసోర్ తరహా ఘోర దుర్ఘటన జరగబోతోందని అంటూ సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులకు ఆ బెదిరింపు లేఖ అందింది. గుర్తు తెలియని వ్యక్తి ఈ లేఖను రైల్వే అధికారులకు పంపించాడని హైదరాబాద్- ఢిల్లీ మార్గంలో ఈ ప్రమాదం జరగనుందని, ఇది విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం అని చెబుతూ ఈ లేఖను రాశారు. ఆ లేఖలో చెప్పినట్టు కాకపోయినా రైలు ప్రమాదం జరగడం సంచలనంగా మారింది.