అనుమానంతో నిండునూరేళ్ల జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు కొందరు. నిజమేంటో తెలియకుండానే లేనిపోని ఊహాలకు పోయి క్షణికావేశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఓ దంపతుల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది. మహేంద్ర, సంధ్య దంపతులు. అయితే.. వీరికి వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయితే.. మండలంలోని పెనుబాక దళితవాడకు చెందిన మహేంద్ర ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. భార్య సంధ్యకు భర్త పరస్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం ఉంది.
Also Read : China On Relations With India: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత్‌తో సంబంధాలపై చైనా
అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. భర్త మహేంద్రకు సైతం తన భార్య సంధ్యపై ఇదే అనుమానం ఉండటంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అయితే.. నిన్న కూడా ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఇద్దరు ఒకరిపైఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. అదే సమయంతో భార్య సంఖ్య భర్త మహేంద్ర మర్మాంగాన్ని గోళ్ళతో రక్కేసింది. ఈ క్రమంలో మహేంద్ర ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికత్స పొందుతున్నాడు. అయితే.. ఈఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.
Also Read : Jr.NTR: ‘లే బాబాయ్.. లే’ చలపతిరావు మృతిపై జూ.ఎన్టీఆర్ భావోద్వేగం