NTR: ‘లే బాబాయ్.. లే’ చలపతిరావు మృతిపై జూ.ఎన్టీఆర్ భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ నటుడు చలపతిరావు తమ్మారెడ్డి(78) కన్నుమూశారు. హైదరాబాదులోని తన తమ్ముడి నివాసంలో తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మహానటుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి వెండితెరపై ఒక వెలుగువెలిగారు చలపతిరావు. చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న ఎన్టీఆర్ తనయులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. సీనినటుడు చలపతిరావు మృతిపట్ల జూ.ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. యూఎస్ నుంచి జూ.ఎన్టీఆర్ వీడియో కాల్లో లే బాబాయ్.. లే అంటూ జూ. ఎన్టీఆర్ బాధను వ్యక్తపరిచారు. నందమూరి ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్నారు. తాతగారి రోజుల నుంచి మాకు చలపతి బాబాయ్ ఎంతో ఆప్తుడని తెలిపారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన.
— Jr NTR (@tarak9999) December 25, 2022
Read Also: Vijay v/s Ajith: విజయ్, అజిత్ పాటల జోరు.. సోషల్ మీడియాలో అభిమానుల పోరు
సీనియర్ నటుడు చలపతి రావు మృతిపట్ల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారని చెప్పారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చలపతిరావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం నిర్వహించనున్నారు. ఆయన కూతురు అమెరికాలో ఉంటుండంతో ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!