మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ తమ యూజర్లకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తూ.. అందరి మన్ననలు అందుకుంటుంది. అయితే, ఇటీవలే హెచ్‌డి ఫోటోలకు సంబంధించిన ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఆప్షన్ విండోస్ యూజర్లకు ప్రత్యేకమని క్లారిటీ ఇచ్చేసింది. ఓ నివేదిక ప్రకారం వాట్సాప్ ను డెస్క్‌టాప్‌లో (వాట్సాప్ వెబ్) వాడే వారి కోసం మిస్డ్ కాల్స్‌కు సంబంధించిన కొత్త కాల్ బ్యాక్ ఫీచర్‌ను తీసుకోస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Varahi Navaratrulu: మహేశ్వరీ దేవి ఆరాధన స్తోత్రం చేస్తే కోపాన్ని అదుపుచేస్తుంది
ఇప్పటివరకు వాట్సాప్ వెబ్ వాడే వారికి కాల్స్, మిస్డ్ కాల్స్‌కు సంబంధించి ఎలాంటి ఆప్షన్ లేదు. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వెబ్ బీటా ఇన్ఫో ప్రకారం వాట్సాప్ మిస్డ్ కాల్స్‌ను గుర్తించేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఆప్షన్లో ‘కాల్ బ్యాక్’ బటన్, ఏదైనా కాల్ వచ్చినప్పుడు దానికి మనం రిప్లై ఇవ్వకపోతే అది ఈవెంట్ మెసెజ్‌లో కనబడుతుంది. ఈ ఆప్షన్ మెక్రోసాప్ట్ స్టోర్ నుంచి విండోస్ లో వాట్సాప్ బీటా లేటెస్ట్ వర్షన్ ఇన్‌స్టాల్ చేసిన వారికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
Read Also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
వెబ్ బీటా ఇన్ఫో ఈ ఫీచర్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేసింది. దీని ప్రకారం, వాట్సాప్ లో మిస్డ్ కాల్ వచ్చిన వెంటనే ఈవెంట్ మెసెజ్ పక్కన ‘కాల్ బ్యాక్’ బటన్ ఆప్షన్ కనబడుతుంది. ఈ బటన్ యూజర్లకు కేవలం ఒక ట్యాప్‌తో మిస్డ్ కాల్‌ని రిటర్న్ కాల్ చేసేలా ఆప్షన్ ను ఇచ్చినట్లు మెటా తెలిపింది. దీని వల్ల యూజర్ల టైం సేవ్ అవుతుంది. త్వరలో అందరు యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ‘మిస్డ్ మెసెజెస్’ అంటే ఇప్పటివరకు ఓపెన్ చేయని, చూడని మెసెజెస్. వీటిని సేవ్ చేసుకునే సదుపాయం కూడా కొత్త అప్‌డేట్‌లో భాగంగా రానుంది.