ప్రస్తుతం స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం చేతిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లలో కచ్చితంగా ఉండే యాప్స్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో వాట్సప్ ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక మంది ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్. అత్యధిక ఫీచర్లతో ఎప్పటికప్పుడు వాట్సప్ వారి యూజర్ల కోసం అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి వాట్సప్ కి ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఉంది. కొత్తగా ఎన్ని రకాల మెసేజ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్న గాని.. వాట్సప్ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. దీనికి కారణం ఎప్పటికప్పుడు వాట్సప్ కొత్త ఫీచర్స్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడమే. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే సెక్యూరిటీ పరంగా వాట్సప్ కొత్త అడుగులు వేస్తూ అనేక రకాల ఫ్యూచర్లను తీసుకోస్తుంది.
Also Read: Sarkar Season 4: ఆట ఆడించేందుకు ఆటగాడు వచ్చేస్తున్నాడు..!
ఇకపోతే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ను వాట్సప్ తీసుకువచ్చింది. మనం వాట్సాప్ లో ఇప్పటి వరకు కేవలం ఆడియో కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ మాత్రమే పరిమితం చేసాము. ఇక తాజాగా వాట్సప్ లో ఏఐ ఫ్యూచర్ ను జోడించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ కొత్త ఏఐ ను వాట్సాప్ పరీక్షించింది. భారత్లో కొందరినీ ఎంపిక చేసి ఆ యూజర్లకు ఫీచర్ కనిపించేలా చేసింది. కాకపోతే ఏమైందో తెలియదు కానీ ఆ ఫీచర్ కొద్దిసేపు మాత్రమే ఉండి ఆ తర్వాత అదృశ్యమైంది.
Also Read: Catherine Tresa: బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..
ఇకపోతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వినియోగం ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడకంలో మెటా సైతం దూసుకు వెళ్లడానికి సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతని కంపెనీలతో పోటీగా నిలబడేందుకు మెటా కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారిత మెటా ఏఐని తయారు చేసుకుంది. ఈ టెక్నాలజీని రాబోయే కొత్త అప్డేట్స్ లో అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నట్లు అర్థమవుతుంది. ఈ కొత్త ఫీచర్ విషయం చూస్తే.. ‘ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్’ అంటూ పాప్ ఓపెన్ అవుతుంది. ఇక దానిపై ఉండే కంటిన్యూ పై క్లిక్ చేస్తే వాట్సాప్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో అచ్చం చాట్ జిపిటి లాగే మీకు ఏదైనా సందేహం ఉన్న.. ఆ సందేహాన్ని చాట్ రూపంలో అడుగుతే ఖచ్చితమైన సమాధానాలను ఇస్తుంది.