తినడానికి తిండి లేని రోజుల నుండి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోగా ఎదిగిన నటులలో సుడిగాలి సుధీర్ ఒకడు. మెజీషియన్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ వేదికగా అంచలంచలుగా ఎదుగుతూ.. అదే క్రమంలో అనేక కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ.. ఆపై టాలీవుడ్ లో కూడా హీరోగా సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ఛానల్ ఏదైనా సరే తన మార్క్ కామెడీతో అందరిని నవ్విస్తూ దూసుకెళ్తాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై షో లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఉగాది పండుగను పునస్కరించుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ కి కూడా ఈయనే యాంకర్ గా చేశాడు. అందులో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీని మడత పెట్టి సాంగ్ కు డాన్స్ చేసి వావ్ అనిపించాడు.
Also read: Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ప్రియులకు గుడ్ న్యూస్..
ఇకపోతే., సుధీర్ మరో షోకు యాంకర్ గా మారాడు. ఆహాలో యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న షో ‘సర్కార్’. ఇప్పటివరకు ఈ షో మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఈ షో లో స్టార్స్ సెలబ్రిటీలను పిలిపించి వారితో ఆటను ఆడిస్తారు. ఆటలో భాగంగా బెట్టింగ్ కట్టించి డబ్బులను తీసుకుంటూ ఫన్ క్రియేట్ చేస్తుంటారు. గత మూడు సీజన్లను ప్రదీప్ తన యాంకరింగ్ స్టైల్ తో విజయవంతం చేసాడు.
Also read: Botsa Jhansi Lakshmi : ఒక సాధారణ మహిళగా మొదలై… బొత్సా ఝాన్సీ లక్ష్మీ విజయ ప్రస్థానం
ఇక ఈసారి మాత్రం సర్కార్ సీజన్ 4 లో ప్రదీప్ ను రీప్లేస్ చేస్తూ సుధీర్ కనపడబోతున్నాడు. ఇక ఇందుకు సంబంధించి ఆహా అధికారికంగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో సుధీర్ ఆట గురించి మాట్లాడుతూ.. మనం క్యాష్ ను పైకి విసురుతాం.. ఎందుకంటే అది కిందపడుతుందని మనకు తెలుసు కాబట్టి.. అది కిందపడదు అని తెలిస్తే .. కనీసం కాయిన్ కూడా విసరం. అది డబ్బుకు ఉన్న పవర్. అలాంటి డబ్బు కోసం డేర్ చేసినోడిదే రోజు.. రిస్క్ చేసినోడే రాజు.. ‘ఆట మారింది.. ఆటగాడు మారాడు’ అంటూ సీజన్ 4 త్వరలోనే మొదలుకానుంది అని తెలిపాడు.