* నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. 65కి పైగా అంశాలతో కేబినెట్ భేటీ.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ-2025-30కి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీకి ఆమోదం తెలుపనున్న కేబినెట్..
* నేడు ఏపీలో కేంద్ర బృందం పర్యటన.. రెండు రోజులు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం.. ఉదయం 10 గంటలకు సచివాలయంలో అధికారులతో సమీక్ష.. తుఫాన్ ప్రభావం, నష్టాలు, పునరుద్ధరణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పౌసుమి నేతృత్వంలో ఏడుగురితో బృందం..
* నేడు పోలీసుల ముందు హాజరుకానున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి సెక్షన్ 179 బీఎన్ఎస్ కింద నోటీసులు జారీ.. ఇవాళ కాశీబుగ్గ పీఎస్ లో విచారణకు హాజరు కానున్న అప్పలరాజు..
* నేడు ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. మొంథా తుఫాన్ ప్రభావంతో ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లో దెబ్బ తిన్న ప్రాంతాలను, పంట నష్టాలను పరిశీలించనున్న కేంద్ర బృందం.. ప్రకాశం భవన్ లో అధికారులతో సమీక్ష, అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన..
* నేటితో ముగియనున్న కల్తీ మద్యం కేసులో నిందితుల కస్టడీ.. ఈ కేసు విచారణలో వేగం పెంచిన సిట్ అధికారులు..
* నేడు మంత్రిగా అజహారుద్దీన్ బాధ్యతలు స్వీకరణ.. మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వ రంగ శాఖల మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్ధీన్..
* నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కిషన్ రెడ్డి.. రైల్వే స్టేషన్ లోని అభివృద్ధి పనుల పరిశీలన..
* నేటి నుంచి గ్రూప్-3 ధృవపత్రాల పరిశీలన.. ఈ నెల 26 వరకు నాంపల్లి తెలుగువర్సిటీలో పత్రాల పరిశీలన..
* నేడు ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. ఇప్పటికే ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరుకున్న వాయు కాలుష్యం..