గత మూడు నాలుగు రోజులగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీ పంట నష్టం చోటు చేసుకుంది. చేతికి వచ్చిన పంటలు అకాల వర్షాలతో పాడవడంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. కాగా.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివానం ఏర్పడిని అల్పపీడన ద్రోణి ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉత్తర కర్ణాటక, మరఠ్వాడ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది.
Also Read : IPL2023 : ఢిల్లీ క్యాపిటల్స్ న్యూ జెర్సీ.. ట్విట్టర్ లో వీడియో పోస్ట్!
ఆదివారం తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నార్త్ హైదరాబాద్ ప్రాంతంలో వర్షం మొదలైంది. ముఖ్యంగా పటాన్ చెరువు, అమీన్ పూర్, బాచుపల్లి, కొంపల్లి, కండ్లకొయ్య, మేడ్చల్, గండి మైసమ్మ, దుండిగల్ లో వర్షం పడింది.
Also Read : 12Pages : 12పేజీల సూసైడ్ నోటు.. చదివితే షాకింగ్ విషయాలు
రానున్న గంట, రెండు గంటల్లో అన్ని ప్రాంతాలకు వాన విస్తరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. గత మూడు నాగులు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందినప్పటికీ.. ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.