12Pages : దేశంలో రోజురోజుకు నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో నిత్యం హత్యలు, అత్యాచారాలు, అనైతిక సంబంధాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు అందులో ఓ షాకింగ్ టైప్ బయటికి వచ్చింది. మార్చి 17న ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లా జోషిగావ్‌లో ఒకే ఇంట్లో నలుగురి మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. మహిళ, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. మృతులను భూపాల్ రామ్ భార్య నందిదేవి, పెద్ద కుమార్తె అంకిత (14), పిల్లలు కృష్ణ (7), భవేష్ (1)గా గుర్తించారు.
భూపాల్ రామ్ ఇక్కడ అద్దెకు ఉంటున్నాడు. బాగేశ్వర్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి శనివారం వెల్లడించారు. 8వ తరగతి చదువుతున్న అంకిత తన పుస్తకంలో 12 పేజీల సూసైడ్ నోట్ రాయగా.. దీనికి సంబంధించిన షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. అంకిత రాసిన మాటలు చదివి అందరికి కన్నీళ్లు వచ్చాయి. పోలీసులకు దొరికిన సూసైడ్ నోట్‌లో అంకిత తన తల్లి సల్ఫాస్ తెచ్చిందని రాసింది. ఆర్థిక సమస్యలు, బాధ్యతల కారణంగా అతని కుటుంబం చితికిపోయింది. అప్పులు తీసుకున్న వ్యక్తులు తరచూ వారి ఇళ్లకు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తూ వారిని వేధించేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె తల్లి మానసికంగా చాలా కుంగిపోయింది. అంతేకాకుండా ఆమె తండ్రి కూడా చాలా బాధపడ్డాడు.
Read Also: Janhvi Kapoor: ఎన్టీఆర్ ను కలవడానికి ఆగలేక.. రోజు మెసేజ్ లు చేస్తున్నా
మార్చి 1 నుంచి ఇంటికి రాలేదు. డబ్బు కోసం అప్పు ఇచ్చినోళ్లు ఇంటికి వచ్చారు. వారు గొడవ చేస్తుండడంతో స్థానిక పోలీసుల సహాయాన్ని కూడా అభ్యర్థించినట్లు అంకిత సూసైడ్ నోట్‌లో రాసింది. అయితే వారి నుంచి ఎలాంటి సహకారం అందలేదు. పోలీసులకు లభించిన సూసైడ్ నోట్‌పై వెంటనే చర్యలు తీసుకుని ఎస్పీ బాగేశ్వర్ ఎస్‌హెచ్‌ఓను సంప్రదించారు.
Read Also: Viral: తల్లి, అమ్మమ్మ, అత్త, కోడలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే.. ?
బాగేశ్వర్ ఎస్పీ హిమాన్షు వర్మ మాట్లాడుతూ.. రేషన్ కొనే స్థోమత కుటుంబానికి లేదని తెలిపారు. పోలీసులు భూపాల్ రామ్‌ని కనుగొన్నారు. మూడు నెలల క్రితం తన వద్ద మొబైల్ ఉందని చెప్పాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మొబైల్ కూడా అమ్మేశాడు. ఈ వ్యవహారంలో ఓ మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రీమాలో నివసిస్తున్న ఓ మహిళ నుంచి భూపాల్ రామ్ కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత మహిళపై ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉంది.