భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ ఏరియాలో మరోసారి కలకలం రేగింది. మద్దుకూరు ఫారెస్ట్ ఏరియాలో వాచర్ బైక్ నీ గుత్తి కోయలు దగ్ధం చేశారు .దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దుకుర్ బీట్ పరిది లో 20 హెక్టర్ ల ఫారెస్ట్ భూమి వుంది. గతం లో ఫారెస్ట్ ఏరియాలో గుత్తి కోయిల ను అడ్డుకోవటానికి ప్రయత్నం చేసిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుని హత్య చేసిన విషయం తెలిసింది. ఇది జరిగి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న 20 హెక్టార్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్న భూమిలోకి గుత్తి కోయలు మేకల్ని పంపించారు.
Also Read : Bopparaju Venkateswarlu: జీవో ఇచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదు..!
అయితే ఆ మేకల్ని వాచర్ అక్కడి నుంచి బయటికి పంపించారు. దీంతో గుత్తి కోయిల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాచర్ రాములు బైక్ ను దగ్దం చేశారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తుందా అనే విధంగా కనిపిస్తోంది .గతంలో ఇక్కడే ఫారెస్ట్ భూమి వ్యవహారంలో వివాదం చోటుచేసుకుని రేంజర్ శ్రీనివాసరావుని గుత్తి కోయలు హత్య చేసిన విషయం తెలిసిందే. అది ఇక్కడ సంచలనం మారిన విషయం తెలిసిందే… ఇటువంటి పరిస్థితుల్లో మరో సారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన బైక్ నీ దగ్దం చేయడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read : Botsa Satyanarayana: ఉద్యోగుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ.. మే 1 నుంచి వరుసగా జీవోలు..!