VIVO X Fold 5: వివో (Vivo) తన ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన vivo X Fold 5 ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో ప్రీమియం సెగ్మెంట్‌లో మార్కెట్ లోకి వచ్చేసింది. ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇది ప్రీమియం వినియోగదారుల కోసం అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, భద్రతతో కూడిన అద్భుతమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గా సందడి చేసేందుకు వివో ఈ మొబైల్ ను విడుదల చేసింది.
డిస్ప్లేలు:
ఈ vivo X Fold 5 స్మార్ట్‌ఫోన్ లో 8.03 అంగుళాల 2K+ LTPO AMOLED ఇన్నర్ డిస్ప్లే ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను, 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే, 6.53 అంగుళాల FHD+ LTPO AMOLED కవర్ డిస్‌ప్లే కూడా 120Hz రిఫ్రెష్ రేట్, బ్రైట్‌నెస్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు డిస్ప్లేలు కూడా డాల్బీ విజన్ సపోర్ట్‌తో వచ్చేసింది.
Read Also:Samsung History: ఏంటి! శాంసంగ్ కంపెనీ మొదట్లో ఎండు చేపలు అమ్మిందా..? సంచలన విషయాలు…
ప్రాసెసర్:
కొత్త vivo X Fold 5లో Snapdragon 8 Gen 3 (4nm) ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది Adreno 750 GPU ను కలిగి ఉందాంతో హై ఎండ్ గ్రాఫిక్స్, గేమ్స్ కు బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ మొబైల్ లో 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజ్ ను కలిగిఉంది. ఇక ఇందులో ప్రత్యేకంగా.. ఫోన్ వేడిగా కాకుండా ఉండేందుకు 20762mm² VC + గ్రాఫైట్ కూలింగ్ వ్యవస్థను కూడా ఉపయోగించారు.
కెమెరా సెటప్:
ఈ ఫోన్‌లో ప్రీమియం ఫోటోగ్రఫీ సపోర్ట్ చేసేలా 50MP త్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP (Sony IMX921) ప్రధాన కెమెరా f/1.57 అప్టెర్చర్ తో, OIS సపోర్ట్ తో లభిస్తుంది. అలాగే 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా (Samsung JN1), 50MP 3x పేరిస్కోప్ టెలిఫోటో కెమెరా (Sony IMX882) ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం లోపల, బయట డిస్ప్లే లలో 20MP కెమెరాలు అందించనున్నారు.
బ్యాటరీ:
vivo X Fold 5లో 6000mAh కెపాసిటీ గల బ్లూ వోల్ట్ బ్యాటరీ ఉంది. ఇది రెండవ తరం సెమీ సాలిడ్ స్టేట్ టెక్నాలజీతో రూపొందించబడింది. ఈ బ్యాటరీ –30℃ వద్ద కూడా పనితీరు సాధ్యపడుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ బ్యాటరీకి 80W వైర్డ్, 40W వైర్ లెస్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.
Read Also:Pilot Project: ఏపీలో మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం.. 10 నిమిషాల్లో పని పూర్తి!
రెసిస్టెన్స్:
ఈ ఫోన్ IPX8, IPX9, IP9+ వంటి ప్రధాన వాటర్ రెసిస్టెన్స్, IP5X డస్ట్ రెసిస్టెన్స్, –20°C వరకు ఫ్రీజ్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ను పొందింది. కార్బన్ ఫైబర్ సపోర్ట్ హింజ్ 6 లక్షల సార్లు ఫోల్డింగ్ కు పరీక్షించింది. ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉన్న ఈ మొబైల్ కేవలం 217 గ్రాముల బరువు ఉండడం విడ్డురమే. ఈ మొబైల్ 4.3mm (అన్‌ఫోల్డ్), 9.2mm (ఫోల్డ్) మందంతో అందుబాటులోకి వచ్చింది.
ధర:
అందుబాటులో ఉన్న ఏకైక వేరియంట్ 16GB + 512GB ను రూ.1,49,999 ధరను నిర్ణయించారు. ధర ఎక్కువగానే కనపడుతున్న ప్రీమియం ఫిచర్స్ ఉండడంతో వినియోగదారులు ఎంతవరకు దీనిని కొనడానికి ఇష్టపడుతారో చూడాలి. ఈ మొబైల్ జూలై 30 నుండి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా స్టోర్, రిటైల్ స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయి. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
లాంచ్ ఆఫర్లు:
vivo X Fold 5 మొబైల్ లాంచ్ ఆఫర్ కింద నెలకు రూ. 6,250 EMIతో 24 నెలల No Cost EMI, జీరో డౌన్ పేమెంట్ లో పొందవచ్చు. అలాగే ఎంపిక చేసిన బ్యాంకులపై 10% స్పాట్ క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. వీటితోపాటు V-Upgrade ఎక్స్చేంజ్ బోనస్, 1 సంవత్సరం ఫ్రీ వారంటీ లభిస్తుంది. అలాగే V-Shield పై 70% డిస్కౌంట్, vivo TWS 3e సెట్ కేవలం రూ.1,499కే లభిస్తుంది.