ఏపీలో మరో పైలెట్ ప్రాజెక్టుకు రిజిస్ట్రార్ శాఖ శ్రీకారం చుట్టింది. 10 నిమిషాల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్ కొనుగోలు దారుడికి ఇచ్చేలా పైలట్ ప్రాజెక్టును లాంచ్ చేశారు. సోమవారం పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ప్రాజెక్టును అధికారులు ప్రారంభించారు. 10 నిముషాల్లోగా 3 డాక్యుమెంట్స్‌ను రిజిస్టర్ చేసి.. మొదటి గంటలోగా ముగ్గురు కస్టమర్స్‌కు అధికారులు అందజేశారు.
Also Read: Perni Nani: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మహానటి.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!
పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును రిజిస్ట్రార్ శాఖ అమలు చేయనుంది. డాక్యుమెంట్ల స్కాన్ కాపీని వాట్సాప్ ద్వారా కూడా కస్టమర్స్‌కు అధికారులు అందజేస్తున్నారు. 10 నిమిషాల్లోనే పని పూర్తవడంతో కస్టమర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి కావాలంటే రోజుల పాటు కాళ్లు అరిగేలా కస్టమర్స్ తిరగాల్సి వచ్చేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అవుతోంది. త్వరలోనే ఏపీ మొత్తంగా ఈ ప్రాజెక్టు ఆరంభించే అవకాశాలు ఉన్నాయి.