Vitamin D Deficiency: ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి కీలకమైనది. దీనిని ‘సన్‌షైన్ విటమిన్’ అని అంటారు. ఎందుకంటే, సూర్యకాంతి ద్వారా ఇది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి లోపం శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. అయితే దాన్ని గుర్తించడం కొంచెం కష్టం. కానీ, కొన్ని లక్షణాలు కనిపిస్తే శరీరంలో విటమిన్ డ్ లోపం ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ఆ లక్షణాలెంతో ఒకసారి చూద్దామా..
Also Read: CM Chandrababu : మద్యం దుకాణదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త
* ఎటువంటి కారణం లేకుండా తరచూ అలసిపోయినట్లు అనిపిస్తే, ఇది విటమిన్ డి లోపం సూచన కావచ్చు.
* శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దాంతో పదేపదే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
* కండరాలు, ఎముకల ఆరోగ్యంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల కండరాల బలహీనత, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.
* విటమిన్ డి శరీరంలో కాల్షియం శోషణకు సహాయపడుతుంది. దీని లోపం ఆస్టియోమలాసియా (ఎముకల బలహీనత) వంటి సమస్యలకు దారితీస్తుంది.
* జుట్టు పెరుగుదల కోసం కూడా విటమిన్ డి అవసరం. దాని లోపం వల్ల అధిక జుట్టు రాలడం జరగవచ్చు.
* విటమిన్ డి లోపం డిప్రెషన్‌ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం కలిగిస్తుంది.
* విటమిన్ డి లోపం ఉన్నవారిలో బరువు పెరగడం సాధారణం. ఇది కొవ్వు కణాల్లో విటమిన్ డి నిల్వ అవ్వడమే కారణం.
* చర్మ వ్యాధులు, ముఖ్యంగా ఎగ్జిమా సమస్యలు, విటమిన్ డి లోపంతో పొంచి ఉంటాయి.
* దంతాల బలహీనత, దంత వ్యాధులు విటమిన్ డి లోపం వల్ల రావచ్చు.
* పిల్లలలో విటమిన్ డి లోపం రికెట్స్ సమస్యకు కారణం అవుతుంది. ఇది బలహీన ఎముకలను కలిగిస్తుంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే ఈ విటమిన్ డి లోపాన్ని నివారించేందుకు కొన్ని పరిష్కారాలు ఇలా ఉన్నాయి..
* ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యకాంతిలో గడపడం ద్వారా విటమిన్ డి స్థాయిని మెరుగుపరుచుకోవచ్చు.
* పాలు, చేపలు (సాల్మన్, ట్యూనా), గుడ్లు, బచ్చలికూర, క్యారెట్లు వంటి ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చడం ద్వారా విటమిన్ డి ను పొందవచ్చు.
* డాక్టర్ సలహాపై విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా లోపాన్ని భర్తీ చేయవచ్చు.