Virat Kohli: ప్రపంచ కప్లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ తన బర్త్ డే రోజున సెంచరీ చేసి.. తన ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు. 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీకి ఈ సెంచరీ ఓవరాల్ గా 78 వ అంతర్జాతీయ సెంచరీ.
IND vs SA: సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం.. సెంచరీతో అదరగొట్టిన కింగ్ కోహ్లీ
ఇదిలా ఉంటే.. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో చివరి వరకు ఆడి 49వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ 49వ సెంచరీ పూర్తి చేశాడు. అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత రోహిత్(31), రికీ పాంటింగ్(30) ఉన్నారు.
𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 in Kolkata for the Birthday Boy! 🎂🥳
From scoring his Maiden century in Kolkata to scoring his 4⃣9⃣th ODI Ton 👑💯#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/pA28TGI4uv
— BCCI (@BCCI) November 5, 2023