Rishabh Pant: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ప్లేయర్లు బ్యాటింగ్ లో రెచ్చిపోతున్నారు. మొదటి రోజు యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీలో అదరగొట్టగా, రెండో రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్ శతకంతో దుమ్మురేపాడు. జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలతో ఇంగ్లాండ్ పై భారత్ అధిపత్యం కొనసాగిస్తోంది.
భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు.
ఛాపియన్ లాహోర్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట ఆస్ట్రేలియా 43 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడగొట్టింది.
Nitish Kumar Reddy: మెల్‌బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌ల సెంచరీ భాగస్వామ్యానికి అనుగుణంగా ఫాలోఆన్‌ను తప్పించుకోవడంలో టీమిండియా విజయం సాధించడమే కాకుండా, మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టును కూడా సడలించింది. నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ 8వ వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 3 పరుగుల తేడాతో సచిన్ టెండూల్కర్ – హర్భజన్ సింగ్‌ల 16 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. దీనితో ఆస్ట్రేలియాలో 8వ వికెట్‌కు భారతీయులు…
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. రెండో రోజు తొలి సెషన్ టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రాణించింది. తొలి సెషన్‌లో టీమిండియా 29.4 ఓవర్లు బౌలింగ్ చేసి 76 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. మూడు వికెట్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు లభించగా, నితీష్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
గుజరాత్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వారం వ్యవధిలోనే మరో సెంచరీ సాధించాడు. మంగళవారం ఉత్తరాఖండ్‌పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పటేల్ 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేశాడు.
సౌతాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా ముందు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీ సాధించాడు. నాలుగో రోజు బెంగళూరు స్టేడియంలో 110 బంతుల్లో తొలి అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీతో రాణించిన సర్ఫరాజ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2024 అక్టోబర్ 10న అతనికి 29 ఏళ్లు నిండాయి. కాగా.. గులామ్ తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్‌గా నిలిచాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు.