వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టు ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. తొలి వన్డేలో ఆటగాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ మార్చి ఖంగుతున్న టీమిండియా.. సెకండ్ వన్డేలో కూడా అటువంటి పిచ్చి పనులే చేస్తుంది. ఏకంగా ఈ మ్యాచ్‌కు జట్టు మెనెజ్‌మెంట్ స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టింది. దీని ఫలితంగా బార్బోడస్ వేదికగా జరిగిన వన్డేలో విండీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైంది.
Read Also: Rahul Dravid: ఎందుకు సర్ ఈ ప్రయోగాలు.. మీ వల్ల అన్నీ నష్టాలే..
వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండంతో ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశంతో సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు ఈ మ్యాచ్‌లో ఛాన్స్ ఇచ్చింది. కానీ వీరిద్దరూ తమకు వచ్చిన ఛాన్స్ ను సద్వినియోగ పరుచుకోలేకపోయారు. విరాట్ కోహ్లి స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన శాంసన్ కేవలం 9 రన్స్ చేయగా.. నాలుగో స్ధానంలో వచ్చిన అక్షర్ ఒక్క రన్ మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ 40.5 ఓర్లలోనే 181 పరుగులకు ఆలౌట్ అయింది.
Read Also: Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి
భారత ఓపెనర్లు తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం అందించగా.. మిగితా ప్లేయర్లంతా కలిసి కేవలం 91 పరుగులు మాత్రమే చేశారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్, కార్టీ రాణించారు. ఇక టీమిండియా తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వాత్ర విమర్శలు వస్తున్నాయి. వరల్డ్‌కప్ ముందు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటూ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Nose Typing: ముక్కుతో టైపింగ్ చేసి రికార్డు సృష్టించిన యువకుడు
ఇక ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శనపై విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మ్యాచ్‌ను చూసిన కోహ్లి.. టీమిండియా ఓటమితో కావడంతో తల పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ వీడియోపై ఫ్యాన్స్ స్పందిస్తూ.. కింగ్ కోహ్లి ఉంటే కఛ్చితంగా ఫలితం మరో విధంగా ఉండేది అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మూడో వన్డేకు విరాట్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
No point in watching a match without Kohli. They rested him from T20s to make sure he focuses on Tests and ODIs, but now they are resting him in ODIs too. Clown management @BCCI pic.twitter.com/dOGQM6g086
— Yashvi (@BreatheKohli) July 29, 2023