Happy Birthday Virat kohli: క్రికెట్ లో ఫార్మేట్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించే వ్యక్తి విరాట్ కోహ్లీ. టెస్టు, వన్డే, టి20 ఫార్మేట్ ఏదైనా సరే.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొని ఎంతోమందిని అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకున్న విరాట్ కోహ్లీ నేడు 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ టీమిండియా గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా తన టి20 రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి విధితమే.
RC16 Shooting : రామ్ చరణ్, జాన్వీల ‘RC16’ షూటింగ్ అప్పటి నుంచేనా ?
భారత మాట్స్ మాన్ విరాట్ కోహ్లీ కం బ్యాక్ కింగ్ అని కూడా పిలుస్తారు. భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని కమ్‌బ్యాక్ కింగ్ అని పిలుస్తారు. ఎందుకంటే, అతను తన కెరీర్‌లో చాలా తక్కువ సార్లు బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొన్నప్పటికీ, అతనికి ఇది జరిగినప్పుడల్లా, అతను తన బ్యాట్‌తో స్పందించాడు. ఆస్ట్రేలియా పర్యటన అయినా, ఇంగ్లండ్‌లో పరుగులు చేసినా, చాలా కాలం పాటు అతని బ్యాట్‌తో సెంచరీ చేయకపోయినా.. ఒకటి రెండు సార్లు కాదు, చాలా సార్లు విరాట్ కోహ్లి తన బ్యాడ్ ఫేజ్ ఎక్కువ కాలం ఉండదని తన బ్యాట్ తో చూపించాడు. ప్రస్తుతం కూడా విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్ లో కలిపి 100 పరుగులు కూడా చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు, కోహ్లీ తన కెరీర్‌లో ఆడిన 5 బెస్ట్ నాక్స్ గురించి చూస్తే..
Shikhar Dhawan: గబ్బర్ మళ్లీ ప్రేమలో పడ్డాడు.. ఓ అమ్మాయితో ధావన్ (వీడియో)
* 2012లో జరిగిన ఆసియా కప్‌లో మీర్పూర్ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌తో భారత్ తలపడగా.. నిర్ణీత 50 ఓవర్లలో 329 పరుగులు చేసింది. 330 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌కు విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ మ్యాచ్ లో 148 బంతుల్లో 183 పరుగులు బాది వన్డేల్లో కోహ్లీ బెస్ట్ స్కోరు నమోదు చేసుకున్నాడు.
* 2012 ఫిబ్రవరిలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో శ్రీలంకతో భారత్ తలపడిన మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది శ్రీలంక. అయితే, టీమిండియా ఫైనల్ చేరాలంటే.. 40 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ 16ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 బంతుల్లో 133 పరుగులు బాది విజయాన్ని అందించాడు.
5⃣3⃣8⃣ intl. matches & counting 👌
2⃣7⃣1⃣3⃣4⃣ intl. runs & counting 🙌2⃣0⃣1⃣1⃣ ICC World Cup Winner 🏆
2⃣0⃣1⃣3⃣ ICC Champions Trophy Winner 🏆
2⃣0⃣2⃣4⃣ ICC Men's T20 World Cup Winner 🏆Here's wishing Virat Kohli – Former #TeamIndia Captain & one of the finest batters – a very… pic.twitter.com/gh4p3EFCO9
— BCCI (@BCCI) November 5, 2024
* 2016లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో భారత జట్టు టీ20 మ్యాచ్ లో.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో 8 ఓవర్లలో కేవలం 49 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీ 51 బంతుల్లో 82 రన్స్ చేసి విజయాన్ని అందించాడు.
* 2018 ఆగస్టులో ఎడ్జ్ బాస్టన్లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అందరూ విఫలమైన 225 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 149 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు.
* మెల్బోర్న్ వేదికగా 2022 అక్టోబరు 23న పాకిస్థాన్, భారత్ మధ్య టీ20 మ్యాచ్ కోహ్లీ క్రికెట్ లైఫ్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్. పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఆ తర్వాత బాధ్యత తీసుకున్న కోహ్లీ కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.