Vidudala: కోలీవుడ్ డైరెక్టర్ వెట్రి మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు పరాజయమే ఎరుగని దర్శకుల్లో వెట్రి మారన్ ఒకరు. ఆయన కథలు ఎప్పుడు రియలిస్టిక్ గా ఉంటాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, గౌతమ్ వాసదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 31 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేశాడు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్ ‘జీ5’ ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తాజాగా తెలుగు వెర్షన్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మే 24 నుంచి ఈ సినిమా తెలుగు స్ట్రీమింగ్ అవుతుండగా.. మే 26న ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్స్ కట్ స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేటర్ వెర్షన్‌లో ప్రేక్షకులు చూడని సన్నివేశాలను ఈ డైరెక్టర్స్ కట్‌లో చూసే అవకాశం కలుగుతుంది.
Sukumar: ‘పుష్ప 2’ తర్వాత సుక్కు మాస్టర్ ప్లాన్.. ‘నేనొక్కడినే’ కాంబో రీపీట్..?
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కుమరేశన్ అనే పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించింది. ఈ పాత్రలో సూరి నటించారు. మిలిటెంట్ నాయకుడు పెరుమాల్ (విజయ్ సేతుపతి)ను పట్టుకోవటానికి వచ్చిన పోలీసు బృందానికి డ్రైవర్‌గా కుమరేశన్ పని చేస్తుంటాడు. పెరుమాల్ ఓ ప్రభుత్వ వ్యతిరేక సంస్థను స్థాపించి సాయుధ పోరాటం చేస్తుంటాడు. ఆయన పోరాటం శాంతికి విఘాతాన్ని కలిగిస్తుందని పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటానికి చూస్తుంటారు. కుమరేశన్ సమాజంపై పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటాడు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చిన్న పోలీసుగా తన కెరీర్‌ను స్టార్ట్ చేస్తాడు. సమాజంలో మంచి, చెడుల గురించి తెలుసుకునే క్రమంలో కుమరేశన్‌కి ఆ ఆటవీ ప్రాంతంలో నివసించే అమ్మాయి తమిళరసి (భవానీ శ్రీ)తో ఓ భావోద్వేగ బంధాన్ని ఏర్పడుతుంది. ఈ కారణమే పోలీసులకు బందీగా దొరికిన పెరుమాల్‌ను తప్పించుకునేలా చేస్తుంది. ఆ తరువాత కుమరేశన్ పరిస్థితి ఏంటి అనేది కథ. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే పార్ట్ 2 త్వరలోనే రిలీజ్ కానుంది. విలువలు పాటించకుండా ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండే పోలీసుల క్రూరత్వాన్ని చూపించారు. దీంతో పాటు 1990 దశకంలో తమిళనాడు రాజకీయ పరిస్థితులను కూడా ఇందులో చర్చించారు. మరి థియేటర్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటిటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.