Sukumar: లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్క తప్పడం అంటూ జరగదు. ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్లో సుకుమార్ ఒకడు. క్లాస్ తీయాలన్నా సుక్కునే.. మాస్ గా చూపించాలన్నా సుక్కునే. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆర్యతో బన్నీని స్టార్ గా నిలబెట్టింది సుకుమార్. పుష్పతో ఆ స్టార్ ను కాస్తా ఐకాన్ స్టార్ గా మార్చింది సుకుమారే. మరి ఇప్పుడు పుష్ప 2 తో బన్నీని గ్లోబల్ స్టార్ గా నిలబెట్టడానికి ఓ రేంజ్ లో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 ఏ రేంజ్ లో ఉండబోతుందో ఒక్క పోస్టర్ తోనే చూపించాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ అవుతుందని అంటున్నారు. కాగా, ఈ సినిమా తరువాత సుక్కు.. ఎవరితో సినిమా తీస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాదిలోనే పుష్ప 2 షూటింగ్ ను ఫినిష్ చేయనున్నట్లు టాక్. ఇక ఈ సినిమా తరువాత సుకుమార్ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్లు టాక్ నడుస్తోంది.
Navadeep: ‘మిషన్ ఇంపాజిబుల్ 7’.. టామ్ క్రూజ్ ను రిప్లేస్ చేసిన అల్లు అర్జున్
సాధారణంగా సుకుమార్ కు ప్లాప్ అని అన్నవారితోనే హిట్ అని అనిపించుకోవడం అలవాటు. అల్లు అర్జున్ తో ఆర్య 2 తీసి ప్లాప్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే బన్నీతో పుష్ప తీసి మరింత హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. సుకుమార్ తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో అని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వన్ నేనొక్కడినే సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. అయితే అప్పటి పరిస్థితులను బట్టిఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక దీంతో మహేష్ కు ఎలాగైనా ఒక హిట్ ఇవ్వాలి అనేది సుకుమార్ మాస్టర్ ప్లాన్ అని తెలుస్తుంది. ఇదే కాకుండా ఎప్పటినుంచో మహేష్ తో సుకుమార్ ఒక సినిమా చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం. పుష్పకు ముందే ఉంటుంది అనుకున్నారు కానీ, కొన్ని కారణాల వలన అది మిస్ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైనా వీరి కాంబో మాత్రం పక్కా అంటున్నారు. ఇక ఇంటిపక్క మహేష్, త్రివిక్రమ్ సినిమా తరువాత రాజమౌళి సినిమా ఉంటుంది. అది ఎన్నేళ్లు పడుతుందో ఎవరు చెప్పలేరు. మరి ఈ మధ్యలో వీరి కాంబో ఉంటుందేమో చూడాలి.