US Missile Strike: యూఎస్ మిస్సైల్ దాడి.. ‘‘ఐసిస్’’ అబు ఖదీజా హతం..
- కీలకమైన ఐసిస్ ఉగ్రవాది హతం..
- అమెరికా వైమానిక దాడుల్లో మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Missile Strike: ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రసంస్థని అమెరికా చావు దెబ్బ తీసింది. ఇరాన్‌లోని అల్ అన్బర్ ప్రావిన్స్‌లో జరిగిన ఖచ్చితమైన వైమానిక దాడిలో ‘‘అబు ఖదీజా’’ అని పిలిచే అబ్దుల్లా మక్కీ మస్లేహ్ అల్-రిఫాయ్‌ని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. అబు ఖదీజా ఐసిస్ ఉగ్రవాద సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్ర సంస్థ రెండవ-కమాండ్ పదవిలో ఉన్నాడు. మార్చి 13న జరిగిన దాడిలో మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
అమెరికా సైనిక అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ లాజిస్టిక్స్, ప్రణాళిక, ఆర్థిక నిర్వహణను అబూ ఖదీజా పర్యవేక్షిస్తున్నాడు. వైమానిక దాడి తర్వాత యూఎస్ సెంట్రల్ కమాండ్, ఇరాకీ దళాలు ఘటన స్థలానికి చేరుకుని అబు ఖదీజా, ఇతర ఐఎస్ఐఎస్ ఫైటర్లు మరణించినట్లు నిర్ధారించారు ఇద్దరు ఆత్మాహుతి దుస్తులు ధరించి, మల్టిపుల్ వెపన్స్‌ని కలిగి ఉన్నట్లు తేలింది. డీఎన్ఏ మ్యాచ్ ద్వారా మరణించింది అబు ఖదీజాగా నిర్ధారించారు.
అబు ఖదీజా ఐసిస్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. యూఎస్‌తో పాటు దాని మిత్రదేశాలను తరుచుగా బెదిరిస్తున్నాడు. ఇలా తమను బెదిరించే వారిని తము నిర్వీర్యం చేస్తూనే ఉంటామని యూఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా చెప్పారు. ఇరాకీ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడానీ ఈ ఆపరేషన్‌ని ప్రశంసించారు. 2023లో అబు ఖదీజాపై అమెరికా ఆంక్షలు విధించింది. 2017 నుంచి ఇతను ఐసిస్‌లో చురుకుగా ఉన్నాడు. ఐసిస్ నాయకుడు చనిపోవడంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. మా యోధులు నిరంతరం ఉగ్రవాదుల్ని వేటాడుతారని చెప్పారు.
CENTCOM Forces Kill ISIS Chief of Global Operations Who Also Served as ISIS #2
On March 13, U.S. Central Command forces, in cooperation with Iraqi Intelligence and Security Forces, conducted a precision airstrike in Al Anbar Province, Iraq, that killed the Global ISIS #2 leader,… pic.twitter.com/rWeEoUY7Lw
— U.S. Central Command (@CENTCOM) March 15, 2025
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!