హైట్ పెరగడానికి ఓ వ్యక్తి దాదాపు రూ. 1.35 కోట్లు ఖర్చు పెట్టాడు. తన ఎత్తును ఐదు అంగుళాలు పెంచుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీని కోసం సుమారు $1,70,000 ( రూ. 1.35 కోట్లు ) వెచ్చించాడు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. మోసెస్ గిబ్సన్ ( 41) కేవలం 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉండేవాడు. అయితే.. తాను ఎత్తు తక్కువగా ఉండటం వల్ల.. అమ్మాయిలను ఆకర్షించలేకపోయాడట.. అంతే తాను ఎలాగైనా హైట్ పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అతను తన ఎత్తును పెంచుకోవడానికి చాలా రకాల మందులు వాడాడు. కానీ ఎత్తు మాత్రం పెరగలేడు.
https://twitter.com/TheCosmeticLane/status/1646148511468081154
Read Also : BMW X1 : కస్టమర్లకు షాకిచ్చిన బిఎమ్‌డబ్ల్యూ… భారీగా పెరిగిన ఎక్స్1 ధర
అయితే తాను అందరికీ ఎత్తుగా కనిపించడం కోసం.. బూట్లలో కింద కొన్ని వస్తువులు కూడా పెట్టుకునేవాడు. అయినా కూడా హైట్ గా కనిపించేవాడు కాదట. చాలా మంది వైద్యులను కలిసినా.. తనకు లాభం జరుగలేదని వాపోయాడు. ఎంత ప్రయత్నించినా హైట్ పెరుగకపోవడంతో ఖర్చు ఎక్కువైనా శస్త్ర చికిత్స చేయించుకోవడానికి రెడీ అయ్యాడు. అతను సాప్ట్ వేర్ ఇంజనీర్ గా.. ఉబెర్ డ్రైవర్ గా పని చేయడం ద్వారా మూడు సంవత్సరాల వ్యవధిలో శస్త్ర చికిత్స కోసం $75,000 ఆదా చేయగలిగాడు.. కానీ మొదట ఆపరేషన్ తర్వాత మూడు అంగుళాలు పెరిగాడట.
Read Also : Delhi Metro: మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌లో మహిళపై లైంగిక వేధింపులు.. యువకుడి అరెస్ట్
అయితే దాంతో హ్యాపీగా ఫీలైనా.. ఆ తర్వాత మరో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.. మార్చిలో అతను.. తన ఎత్తుకు మరో రెండు అంగుళాలు పెంచుకోవడానికి రెండవ శస్త్ర చికిత్స కోసం $98,000 ఖర్చ చేసుకున్నాడు. ఎత్తు పెరగడం వల్ల తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని, మహిళలతో మాట్లాడగలుగుతున్నానని అతను చెప్పడం విశేషం. ఈ చికిత్స విధానం చాలా నొప్పితో కూడుకున్నది అయినప్పటికీ.. అతను సంతృప్తిగానే ఉండటం విశేషం.