దక్షిణ కొరియా తీరంలో అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16 కూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సేఫ్ గా బయట పడ్డారు. కేవలం నెలన్నర సమయంలో కొరియా తీరంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలడం ఇది సెకండ్ టైమ్. గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఓ యుద్ధ విమానం కూడా ఇక్కడే కూలిపోయింది. 8వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ గాలిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీకి లోనైంది.. ఆ తర్వాత ఆ విమానం సముద్రంలో కూలినట్లు అమెరికా వైమానిక దళం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే, విమానం కూలుతున్న సమయంలో పైలెట్ సురక్షితంగా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. దక్షిణ కొరియాలో ఉన్న గున్‌సన్ సిటీ బేస్‌ను అమెరికా మిలిటరీ కొన్నాళ్ల నుంచి వినియోగించుకుంటుంది. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై యూఎస్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. పైలెట్‌ను తొందరగా రక్షించిన కొరియా రిపబ్లిక్ దళాలకు, తమ బృందానికి అమెరికా ఎయిర్‌ఫోర్స్ అధికారి థ్యాంక్స్ చెప్పారు.
Read Also: Prabhas : సినిమాలకు గ్యాప్ తీసుకోనున్న ప్రభాస్.. కారణం అదేనా?
అయితే, నార్త్ కొరియా నిన్న (మంగళవారం) తన పశ్చిమ సముద్రంలోకి అనేక క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొనింది. ఉత్తర కొరియా ఈ నెలలో ఈ తరహా క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి.. ఈ నెల 24, 28వ తేదీలలో జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల క్రూజ్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఈ నెల 14న ఘన ఇంధనంతో నడిచే మధ్యశ్రేణి క్షిపణిని సైతం నార్త్ కొరియా పరీక్షించింది. ఉత్తర కొరియా దుందుడుకు చర్యల నేపథ్యంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ల త్రివిధ దళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.