టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. అయితే ప్రభాస్ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే డార్లింగ్ ఆరోగ్యం పై ఫోకస్ పెట్ట బోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..
ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు.. ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉందని టాక్.. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరగా కంప్లిట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఇదిలా ఉండగా ప్రభాస్ గురించి ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి..
చాలా మారిపోయాడని ఫేస్ కూడా కొంతవరకు మారిపోయిందనే న్యూస్ వినిపించింది.. ఇటీవల ప్రభాస్ కి మోకాలి సర్జరీ కూడా జరిగింది. దీంతో కొన్ని రోజులు సినిమా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకొని తన ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని చూస్తున్నారట.. రాజా సాబ్ సినిమా షూటింగ్ సమ్మర్ లో మొదలు కాబోతుంది.. అప్పటివరకు సినిమాలకు గ్యాప్ తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే..