HEALTH: ఫుడ్ అంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు. అందులో చిరుతిండ్లు ఫుల్ గా తినేస్తారు. ఇంకేముంది ఓ ఐదేళ్ల పాప కడుపు నిండా తినేసింది. చివరకు ప్రాణప్రాయ స్థితికి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎంత తినాలో తెలియని వయసు కావడంతో కడుపు టైట్ అయ్యేలా లాగించేసింది. అలా తింటుంటే తల్లిదండ్రులు ఎవరు దగ్గర్లో లేకపోవడంతో డేంజర్ జోన్ లో పడింది ఆ పాప. దారుణ విషయం ఏటంటే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే కావడం.
Read Also: Viral News: ఇదేం పైత్యం సామి.. ఆఖరికి పాములను కూడా వదలరా..
అసలు పాపకు అలా జరగడానికి కారణమేంటంటే.. ఒకే రోజు రాత్రి రెండు పుట్టిన రోజు వేడుకలకు పాప పేరేంట్స్ తీసుకెళ్లారు. అక్కడ నూడుల్స్ మాదిరి చౌమీన్ ను తిన్నది. అక్కడి నుంచి వెంటనే మరో పుట్టిన రోజు వేడుకకు వెళ్లగా, అక్కడ స్వీట్ కార్న్ ను బాగా ఎక్కువ తినేసింది ఆ పాప. తర్వాత పిల్లలతో ఆడుకుంటూ పడిపోయింది. అంతలోనే కడుపులో నొప్పి అంటూ తట్టుకోలేని పరిస్థితిలో ఏడుస్తుండడంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న కిమ్స్ కింగ్స్ వే హాస్పిటల్ కు తరలించారు.
Read Also: karnatraka: రూ.2000వేలు కావాలంటే.. దరఖాస్తు చేసుకోమన్న సీఎం
బాలిక పేరేంట్స్ ఏమీ అర్థంకాక అధికంగా తినడం వల్ల వస్తున్న నొప్పి అనుకున్నారు. దాంతో పాపక యాంటాసిడ్ సిరప్ తాగించినా.. తగ్గలేదు. బాలిక కింద పడిపోయిన అరగంటకు ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రి డాక్టర్లు వెంటనే ఎక్స్ రే తీశారు. అందులోనూ ఏమీ తెలియలేదు. హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం, తీవ్ర నొప్పితో పాప తల్లడిల్లిపోతుండడంతో సీటీ స్కాన్ తీశారు. పొట్ట లోపల చీలినట్టు (పగిలిపోవడం/లేజరేషన్) గుర్తించారు వైద్యులు. వెంటనే లేపరోటామీ చికిత్స నిర్వహించారు. అనంతరం హైఫ్లో నాసల్ క్యానులాతో వెంటిలేటర్ పెట్టారు. అంతేకాకుండా 30 సెలైన్ బాటిళ్లతో వైద్యులు పాప పొట్టను క్లీన్ చేశారు. అయినా పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అందుకే పిల్లలు తినే సమయంలో పేరేంట్స్ దగ్గరే ఉండే చూసుకోవాలని కిమ్స్ కింగ్స్ వే హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ గోయల్ సూచించారు.