ట్రెండ్ కు తగ్గట్లు చెయ్యాలని జనాలు వింత ప్రయోగాలు చేస్తున్నారు.. కొన్ని ప్రయోగాలు సక్సెస్ అయితే.. మరికొన్ని మాత్రం ఫెయిల్ అవ్వడమే కాదు జనాల కోపానికి కూడా కారణం అవుతున్నాయి.. ఒకప్పుడు వివాహం అంటే ముహూర్తం పెట్టి మూడు ముడ్లు వేయించేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించేలా ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా..పెళ్లికి ముందే జంటలు కొండా కోనలు తిరుగుతూ ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు..
సినిమాలను మించేలా సెటప్ తో చేస్తున్నారు.. ఇందుకోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్స్, కొరియో గ్రాఫర్స్, మేకప్ ఆర్టిస్టులు కూడా అందుబాటులోకి వచ్చారు. అయితే అంతా బాగానే ఉన్నా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ పేరుతో కొందరు చేస్తున్న పనులే ఇప్పుడు పిచ్చి పీక్స్‌కి చేరినట్లు కనిపిస్తోంది. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కొందరు చేస్తున్న పనులకు నవ్వాలో.. ఏడవాలో తెలియక జనాలకు పిచ్చెక్కుతుంది..
తాజాగా ఓ ప్రీ వెడ్డింగ్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఓ జంట ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఏకంగా పాము థీమ్‌నే ఉపయోగించుకున్నారు. ఆ ఫొటో షూట్ ద్వారా చిన్న కథను కూడా చెప్పే పయత్నం చేశారు. యువతికి అటుగా నడుస్తూ రాగా ఆమెకు పాము ఎదరవుతుంది. దీంతో ఆమె భయపడి పోయి రెస్క్యూ సర్వీసుకు కాల్ చేసి పిలిపించింది. ఇందులో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి.. అందులో ఓ వ్యక్తి యువతి వైపు చూసి నవ్వుతాడు.. ఆ తర్వాత ఫోన్ చెయ్యమని నెంబర్ ఇస్తాడు.. అలా ఇద్దరు ప్రేమలో పడతారు.. పాము కలిపిన ప్రేమికులు అని ఆ షూట్ థిమ్..అయితే క్రియేటివిటీ బాగానే ఉన్నా బతికున్న పామును ఫొటో షూట్ కోసం వాడడం కొందరికి కోపం తెప్పిస్తోంది.. ఇది వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు..