తెలంగాణలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణాలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా, సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. 2500 కీ మీ మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని.. ఈ పదేళ్లలో రెండింతలు అయిందన్నారు. ఇప్పటికే 5 వేల కిలోమీటర్లకు పైగా పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోందన్నారు.
Also Read:Illegal Sand Transportation: ఆంధ్రా నుంచి సత్తుపల్లి వరకూ జోరుగా అక్రమంగా ఇసుక రవాణా
జాతీయ దారుల వల్ల రోడ్ సేఫ్టీ ప్రధాన భూమిక పోషిస్తోందని తెలిపారు. వేగంగా వెళ్ళడమే కాకుండా, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. దేశాభివృద్ధికి జాతీయ రహదారుల పాత్ర కీలకం అని తెలిపారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాలతో అద్భుతమైన అనుసంధానం ఏర్పడింది.. తెలంగాణలో వెనుకబడిన, మారుమూల ప్రాంతాలకు జాతీయ రహదారుల వల్ల అభివృద్ధికి సరికొత్త అడుగులు పడుతున్నాయని తెలిపారు. భారతదేశ పురోగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో సమావేశం అయ్యాను.. తెలంగాణలో సుమారు 30 వేల కోట్లతో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.