తెలంగాణలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణాలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా, సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. 2500 కీ మీ మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని.. ఈ పదేళ్లలో రెండింతలు అయిందన్నారు. ఇప్పటికే 5 వేల కిలోమీటర్లకు పైగా పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోందన్నారు. Also Read:Illegal Sand Transportation: ఆంధ్రా…
దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలతో పాటు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిపై చర్చించారు బాలయ్య. పార్లమెంట్‌కు వెళ్లిన బాలకృష్ణ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడిగానే కాదు ప్రజాప్రతినిధిగా తన సేవా ప్రయాణం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతపై బాలకృష్ణ, స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల…
జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించడంపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతరం నేషనల్ హైవే ప్రాజెక్టుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. NHAI, MoRTH ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
ప్రాజెక్టులవారీగా నేషనల్ హైవే పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, పనులు చేస్తున్న ఆయా ఏజెన్సీల ప్రతినిధులు హాజరుకాగా.. చేపట్టిన పనులు.. చేపట్టాల్సిన పనులు.. వివిధ దశల్లో ఉన్న జాతీయ రహదారుల పనుల పురోభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష చేశారు.