Undavalli Arun Kumar: యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)పై సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం యూనిఫాం సివిల్ కోడ్ గురించి దేశం అంతటా చర్చ జరుగుతోంది.. కానీ, యూనిఫాం సివిల్ కోడ్ ను మొదటగా తీసుకుని వచ్చింది బీజేపీ కాదన్నారు. రాజ్యాంగంలోనే డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ లో యూనిఫాం సివిల్ కోడ్ ఉందని గుర్తుచేశారు. ఇక, వెనుకబడిన వర్గాల్లోనే జనాభా ఎక్కువగా ఉంటుంది.. కానీ, ముస్లింల్లో జనాభా ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారని.. దీని ద్వారా విద్వేషాన్ని పెంచుతున్నారని దుయ్యబట్టారు.
Read Also: Kishan Reddy: ఎట్టకేలకు మౌనం వీడిన కిషన్‌రెడ్డి.. అధిష్టానం నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు
2018లో ప్రధాని నరేంద్ర మోడీ 21వ లా కమిషన్ ను వేశారు.. ఈ కమిషన్ తన నివేదికలో యూనిఫాం సివిల్ కోడ్ ఈ సమయంలో తీసుకుని రావాల్సిన అవసరం లేదని చెప్పిందని గుర్తుచేశారు ఉండవల్లి.. రెండు వారాల కిందట వచ్చిన 22వ లా కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఇక, నా చిన్నప్పుడు మేనరికం చేసుకోకపోతే తప్పుగా పరిగణించేవారు.. ఆరోగ్య కారణాల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్న ఉండవల్లి.. అయినా కొన్ని చోట్ల మేనరికపు వివాహాలు జరుగుతున్నాయన్నారు. కొన్ని సిక్కు వర్గాల్లో అన్న చనిపోతే మరిది.. వదినను పెళ్ళి చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది.. ముస్లిం సంప్రదాయంలో పెళ్లి అంటే ఒక కాంట్రాక్టు.. హిందూ సంప్రదాయంలో పెళ్లి అంటే జన్మజన్మల బంధం.. విడాకులు అనే ప్రస్తావనే లేదు.. మరి యూనిఫాం సివిల్ కోడ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దేశంలో సగటు జనాభా ఆదాయం తగ్గి పోతే… అంబానీలు, అదానీల ఆదాయాలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు ఉండవల్లి.
Read Also: Ponnala: పార్టీలో ఓబీసీ లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలి..
ఇక, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు యూనిఫాం సివిల్ కోడ్ పై తమ విధానం ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.. రేపు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీలు తమ వైఖరిని ప్రజలకు వెల్లడించాలన్నారు. సిద్ధాంత కాలుష్యం దేశాన్ని చుట్టేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. దీంట్లో నుంచి బయటపడితే కానీ దేశం అభివృద్ధి సాధించదన్నారు. మహాత్మా గాంధీని ఢిల్లీలో ఉదయం అరెస్టు చేస్తే సాయంత్రానికి కేరళ, కన్యాకుమారి లాంటి చోట్ల కూడా బంద్ అమల్లోకి వచ్చేసేది.. మీడియాకు ఉన్న పవర్ అలాందన్నారు. మరోవైపు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో పరిశ్రమలు ఏమైనా వచ్చాయా? అని ప్రశ్నించారు ఉండవల్లి.. ఇద్దరే పారిశ్రామిక వేత్తలు కాశ్మీర్ లో ప్రాజెక్టులు చేపట్టారని వెల్లడించారు.