ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతత్వంలోని కూటమి సర్కార్.. సచివాలయంలో పనిచేసే 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
గుంటూరు జిల్లాలో ఓ ఎస్సై గుండెపోటుతో మృతిచెందాడు.. తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్సైగా పనిచేస్తున్న రవీంద్ర.. ఈ రోజు మందడంలో విధులు ముగించుకుని కారు డ్రైవ్ చేస్తూ గుంటూరు వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు.. తుళ్ళూరు దాటగానే ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కారు ఆపారు రవీంద్ర. కొద్దిసేపటికే కారులోనే ప్రాణాలు కోల్పోయాడు..
కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మద్దతుతో విడివిడిగా పోటీకి దిగడంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్‌పెట్టారు.. రెండు పార్టీల నియోజకవర్గ నేతలను సమన్వయం చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకి బాధ్యతలు అప్పగించారు..
మాజీ మంత్రి రోజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. జిల్లాల్లో సీరియస్ పాలిటిక్స్ నడుస్తోన్న సమయంలో.. కనీసం ఎవరితోనూ టచ్‌లో లేకుండా వెళ్లిపోయిన రోజా.. యూరప్ ట్రిప్‌లో ఎంజాయ్ చేశారట.. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడమే కాదు.. ఆమె డ్రెసింగ్ స్టైల్‌పై కూడా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.