Breaking news: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యాలోని సుదూర ప్రాంతాల్లో దాడి చేసిందుకు వీలుగా ATACMS క్షిపణుల వాడకానికి అనుమతి ఇచ్చాడు. తాజాగా ఉక్రెయిన్ అన్నంత పనిచేసింది. రష్యాలోని పలు ప్రాంతాలపై ATACMS క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Putin To Visit India: భారత్‌లో పుతిన్ పర్యటన.. త్వరలో షెడ్యూల్ ఖరారు..
ఈ పరిణామంలో ఉక్రెయిన్ మరింత సంక్షోభంలో చిక్కుకోబోతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం అణ్వాయుధ విస్తృత వినియోగానికి అనుమతిని ఇచ్చే డిక్రీపై సంతకం చేశారు. తమపై దాడులు నిర్వహిస్తే అణ్వాయుధాలను ఉపయోగించేందుకు ఈ నిర్ణయం సహకరిస్తుంది. అయితే, తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడిపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి కారణాలుగా మారుతాయా..? అనే సందేహం నెలకొంది.