బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై జిల్లా మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వరుస ప్రమాదాలు జరుగుతూ ముక్కుపచ్చలారని యువకులు చనిపోతుంటే ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టట్లేదని అధికారులను మంత్రి నిలదీశారు.
విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు సముద్రంలో మునిగి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద చోటుచేసుకుంది.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లి ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు గల్లంతయ్యారు. నలుగురు ఈత కోసం సముద్రంలోకి వెళ్లగా.. ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి.