మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్‌ను సీఎం కొనియాడారు.
ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా (LWE - లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) నుంచి తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్‌కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి పునరుద్ధరించబడింది.
మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశాలు జరిగాయి. నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “అమరావతి తిరుపతి వైజాగ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు కోసం ప్రత్యేక కల్చర్ సెంటర్ ఉండాలి.. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.. సంస్కృతిని నిరంతరం ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.. సమస్యల పరిష్కారం కోసం మనం ఉన్నాము.. అంతే కాని అడిగినప్పుడు సమస్యలు చెప్పడం కాదు.. జిల్లాలో సమస్య వస్తే ప్లానింగ్…
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్లు వివరించనున్నారు. ప్రతి కలెక్టర్ కు 10 నిమిషాల సమయం కేటాయిస్తారు.. రెవెన్యూ సమస్యలు.. ల్యాండ్ సర్వే.. మద్యం షాపులు.. జిల్లాలో పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాట్సప్ గవర్నెన్స్, పీ4, జిల్లాలో పేదలకు ఇళ్ళ స్థలాలు, సోలార్‌రూఫ్ టాఫ్ లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. READ MORE: Kunal Kamra: మధ్యప్రదేశ్‌లో కునాల్ కమ్రా పోస్టర్లు…
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
Harish Rao : మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా.. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది…
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై.. ఏడాది మా పాలనపై చర్చకు మేం సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామని ఆయన తెలిపారు.
కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమని ఆరోపించారు మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్ లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని, రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరమన్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనా పరమైన అడ్డంకులు తొలగాయని ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నుండి పునః ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కారణంగా సుమారు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మొదలైన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక…