ఘజియాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. పట్టాలు తప్పిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Car Accident: టోల్ గేట్ ఉద్యోగి పైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్..
భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ ఘజియాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ స్టేషన్‌కు చేరుకునే సరికి రైలు వేగం తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన నాల్గో నంబర్ ప్లాట్‌ఫామ్‌కు సుమారు 100 మీటర్ల ముందు జరిగింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లోని ప్రయాణికులను లగేజీ కంపార్ట్‌మెంట్ వెనుక ఉన్న మరో కోచ్‌కు తరలించారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Bhavani Revanna: కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తల్లికి ఊరట.. బెయిల్ మంజూరు