దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో తల్లి భవానీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు అయింది. కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ శుక్రవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇది కూడా చదవంది: R Krishnaiah: ఏపీలో వైసీపీ ఓటమిపై రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
మహిళలపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఇక కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణపైనా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఈ కేసులో హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇది కూడా చదవంది: Prajavani: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తాం.. రాష్ట్ర ప్రణాళిక సంఘం..
రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్ వ్యవహారంలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను విచారించేందుకు సిట్ అధికారులు ఇటీవల నోటీసులు పంపారు. హొళెనరసీపురలో నివాసానికి వెళ్లగా ఆమె అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం ఆమె హైకోర్టులో దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం మంజూరైంది. అయితే.. మధ్యాహ్నం ఒంటిగంటలోపు సిట్ ముందు హాజరుకావడంతోపాటు విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమె విచారణకు హాజరయ్యారు.
విచారణకు హాజరుకాని భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందిన అనంతరం భవానీ రేవణ్ణ సిట్ విచారణాధికారుల ఎదుట హాజరయ్యారు. కిడ్నాప్ కేసులో భవాని కారు డ్రైవర్‌ను సిట్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవంది: Badi Bata: సరికొత్త ప్రచారం దిశగా బడిబాట..