ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. టోల్ గేట్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అతి వేగంతో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Porn addiction: పోర్న్‌కి బానిసలవుతున్న అమెజాన్ జంగిల్ తెగలు.. ఎలాన్ మస్క్ కారణం..
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర్ప్రదేశ్ లోని చిత్రకూట్కు ప్రాంతానికి చెందిన హేమరాజ్ చిజరాసి టోల్ ప్లాజాలో పనిచేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో టోల్ బూత్ వద్దకు ఓ కారు రాగా., ఆ సమయంలో హేమరాజ్ డ్యూటీలో ఉన్నాడు. అయితే ఏ సమయంలో పన్ను కట్టకుండా ఉండేందుకు డ్రైవర్ కారును వేగంగా ముందుకు నడిపాడు. దాంతో అక్కడే ఉన్న హేమరాజ్ కారు ఆపేందుకు ప్రయత్నించాడు.
Chilkur Temple: శని, ఆదివారాలు చిలుకూరు గుడి క్లోజ్ అంటూ చూపిస్తున్న గూగుల్.. స్పందించిన పూజారి..
అదే సమయంలో కారు అతివేగంతో హేమరాజ్‌ను ఢీకొట్టి పారిపోయింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి బయటపడ్డాడు. స్థానికులు, సహచరులు వెంటనే హేమరాజ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం పై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
CCTV footage captures speeding car flung a Toll Plaza worker into the air while attempting to evade toll charges at the Chhajarsi Toll Plaza on the Delhi-Lucknow Highway in Uttar Pradesh's Hapur.#viralvideo #HapurVideo #Chhajarsi #speedingcarviralvideo #DelhiLucknowHighway… pic.twitter.com/OcaFch5I0E
— Republic (@republic) June 7, 2024