మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ నేతలు తుమ్మలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రోహిణ్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.
Also Read : Prabhas: ప్రభాస్ ను పక్కనపెట్టుకొని.. హీరోయిన్ తో ఆ పని చేయించడం తగునా మారుతీ ..?
ఈ సందర్భంగా తుమ్మాలను ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు. తుక్కుగూడ విజయభేరి సభలో పార్టీలో చేరాలని సూచించారు. కాగా, ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 17న జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు తుమ్మలతో చర్చించినట్లు తెలిసింది.
Also Read : Off The Record: టీడీపీ-జనసేన పొత్తు.. బీజేపీకి మైండ్ బ్లాంక్ అయిందా..?
మరోవైపు జిట్టా బాలకృష్ణారెడ్డి, యొన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రేపు జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశంకు తుమ్మల నాగేశ్వర్ రావు టీకాంగ్రెస్ నేతలతో కలిసి హాజరుకానున్నారు. అయితే.. ఈ క్రమంలోనే.. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరనున్నారు. రేపు మంచి రోజు కావడంతో తుమ్మల జాయిన్ అవుతున్నారని వెల్లడించారు.