Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ప్రభాస్ భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక అభిమానులందరూ ప్రభాస్ నెక్స్ట్ సినిమా సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల మధ్య డార్లింగ్ మారుతి దర్శకత్వంలో చిన్న సినిమా ఒకటి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా.. మరో ఇద్దరు కుర్ర హీరోయిన్లు సెకండ్ లీడ్స్ లో నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ పోస్టర్స్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మాళవిక మోహనన్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె మాస్టర్, మారన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి కూడా కొద్దిగా పరిచయమైంది. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే వారికి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును మత్తెక్కించే భామల్లో మొదటి పేరు మాళవికదే ఉంటుంది.
Deepika Padukone: ఫ్రెండ్ షిప్ అంటే దీపికాదే.. షారుఖ్ కోసం ఆ పని చేసి..?
ఇక తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో పింక్ కలర్ డ్రెస్ వేసుకొని యాక్షన్ మోడ్ లో కనిపించింది. కూరగాయల మార్కెట్లో ఆమె ఫైట్ చేస్తున్న సీన్స్ మేకింగ్ ను వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ వీడియో చూసిన వారందరూ ఈ సీన్ ప్రభాస్ నటిస్తున్న చిత్రంలోనిదే చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు.. మారుతీపై ఫైర్ అవుతున్నారు. ఆరడుగుల కటౌట్ ప్రభాస్ ను పక్కన పెట్టుకొని హీరోయిన్ తో కూరగాయల మార్కెట్లో ఫైట్ చేయించడం ఏంటి..? ఇది మేము అసలు ఊహించలేదు.. ఇదే కనుక నిజమైతే మామూలుగా ఉండదు అంటూ డైరెక్టర్ ను ఏకీపారేస్తున్నారు. ఈ వీడియో ఏ సినిమాలోదో మాళవిక చెప్పకపోవడంతో ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ సీన్ గనుక ప్రభాస్ సినిమాలోని అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కచ్చితంగా మారుతీని టోల్ చేస్తారు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై మారుతి ఒక క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.