బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40సంవత్సరాలలో ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానని, జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేశానని, పదవి కాలంలో గ్రామ సీమలు రైతాంగం, ప్రజలు అడిగిన పనులు పూర్తి చేశానన్నారు. అంతేకాకుండా.. నీతి నియమాలతో పని చేసి చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టు లు పూర్తి చేశామన్నారు తుమ్మల. అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో మెలైన పంటలు పండించే సామర్ధ్యం, విద్యుత్ ఉత్పత్తి పై అనేక ఉపనదులపై చెక్ డ్యాంలు పూర్తి చేసి పంటలు సస్యశ్యామలం చేశామన్నారు. వేల కోట్లతో జాతీయ రహదారులు సాధించామని తుమ్మల వ్యాఖ్యానించారు.
Also Read : GVL Narasimha Rao: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీ జీవీఎల్ బహిరంగ లేఖ
టీడీపీ, కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ ఉత్పత్తికి కృషి చేశామని, ప్రతి గ్రామానికి మంచి నీరు అందించామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తో అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. 40ఏళ్ల రాజకీయ జీవితం నాకు సంతృప్తి ని ఇచ్చిందని, అయితే.. ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించటం నా ఎకైక లక్ష్యమన్నారు తుమ్మల. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఖమ్మం జిల్లా అభివృద్ధిని చూస్తున్నారన్నారు. గోదావరి జలాలతో పాలేరు ప్రజల పాదాలు కడిగి నా రుణం తీర్చుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..25మందికి గాయాలు