స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 12,000 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ శాఖతో పాటు ఇతర విభాగాలకు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 85% ఇంజనీర్లను జనరల్ క్లర్కులు, అసోసియేట్‌లుగా ఎంపిక చేసే వ్యవస్థను రూపొందిస్తామని ఆయన ప్రకటించారు.
Also Read: Aarambham Movie Review: ఆరంభం మూవీ రివ్యూ
అలాగే ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తామని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, బ్యాంక్ లో పనిచేసేవారి సంఖ్య 2, 35,858 నుండి 2,32,296కి పడిపోయింది. ఈ బ్యాంకు కూడా టెక్నికల్ స్కిల్స్ కోసం విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Beer Cans: మద్యం తాగుతూ లక్షాధికారిగా మారిన వ్యక్తి.. ఎలా అంటే..
ఇక ఈ ఏడాది చివర బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ను విడుదల చేయబోతోంది. ఇందులో కూడా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను నియమించబోతున్నారు.